అక్కడ పట్టెడన్నం తినాలన్నా మహిళలు భయానక అనుభవం చవిచూడాల్సిన పరిస్థితి. సైనికుల లైంగిక వాంఛలు తీరిస్తేనే వారికి ఆహారం లభిస్తుంది. ఆఫ్రికా దేశమైన సూడాన్ లోని ఒమ్దుర్‌మన్ పట్టణంలోని కొందరు మహిళల దుస్థితి ఇది.