మళ్లీ సేమ్ సీన్!.. శబరిమల కొండపై పెరిగిన రద్దీ - Tv9

శబరిమలలో రద్దీ తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగింది. నిన్న కొంచెం కంట్రోల్‌లోకి వచ్చిన పరిస్థితులు... ఇవాళ మళ్లీ అదుపుతప్పాయ్‌. ఇవాళ ఒక్కసారిగా కొండపైకి పోటెత్తారు అయ్యప్ప భక్తులు. దాంతో, శబరిమల ఆలయ పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయ్‌. క్యూలైన్లు మళ్లీ కిటకిటలాడుతున్నాయ్‌. శబరిమలలో రద్దీని కళ్లకు కట్టినట్టు చూపెడుతోంది టీవీ9. శబరిమలలో పరిస్థితి ఎలా ఉందో ప్రత్యక్షంగా చూపించేందుకు ఆలయం దగ్గర్నుంచి లైవ్‌ రిపోర్టింగ్‌ చేస్తోంది. ప్రధాన ఆలయం నుంచి గంటగంటకూ అప్‌డేట్స్‌ ఇస్తోంది టీవీ9. శబరిమల ప్రధాన ఆలయం దగ్గర ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఉందో మా చీఫ్‌ రిపోర్టర్‌ రాకేష్‌ అందిస్తారు.