పెంపుడు కుక్కతో విమానాశ్రయానికి వచ్చిన ఓ మహిళను ఎయిర్ పోర్ట్ అధికారులు అడ్డుకోవడంతో దారుణానికి ఒడిగట్టింది. శునకాన్ని వెంట తీసుకునేందుకు ప్రత్యేక అనుమతి కావాలని, ఆ పత్రాలు ఉంటే తప్ప శునకాన్ని విమానంలోకి అనుమతించలేమని ఎయిర్‌పోర్ట్ అధికారులు తేల్చిచెప్పారు. దీంతో వెనుదిరిగిన ఆ మహిళ కాసేపటికి ఒంటరిగా వచ్చి విమానం ఎక్కింది. శునకాన్ని తెలిసిన వారికి అప్పగించి ఉంటుందని అధికారులు భావించారు. అయితే, విమానం బయలుదేరిన కాసేపటికి బాత్ రూంలో శుభ్రం చేసేందుకు వెళ్లిన సిబ్బందికి అక్కడ కుక్క చనిపోయి ఉండటం కనిపించింది. అమెరికాలోని ఫ్లోరిడాలో చోటుచేసుకుందీ ఘటన.