ట్రంప్ లా కనిపిస్తూ.. 2021లో కూడా వైరల్ గా మారిన కుల్ఫీ విక్రేత - Tv9

పాకిస్థాన్‌ పంజాబ్‌లోని సాహివాల్ జిల్లాకు చెందిన కుల్ఫీలు అమ్మే వ్యక్తికి అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పోలికలు ఉన్నాయి. స్థానికులు అతడ్ని ‘చాచా బగ్గా’ అని పిలుస్తారు. ప్రముఖ గాయకుడి మాదిరిగా అతడు పాటలు పాడుతుంటాడు. కుల్ఫీ అమ్మేందుకు ఆ వీధుల్లోకి తాను వచ్చినట్లు తన పాటల ద్వారా స్థానికులకు తెలియజేస్తుంటాడు.