అత్యవసరంగా ల్యాండైన విమానం - Tv9

బాంబు బెదిరింపు రావడంతో పుణె నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన విమానం ముంబయి విమానాశ్రయంలో దిగాల్సి వచ్చింది. 185 మంది ప్రయాణికులతో వెళ్తోన్న ఆకాశ ఎయిర్‌ విమానం శనివారం అత్యవసరంగా ల్యాండ్ అయింది. ‘నా బ్యాగులో బాంబు ఉంది’ అంటూ ఒక ప్రయాణికుడు బెదిరించడంతో ఉదయం ముంబయిలో దిగింది. ఆ వెంటనే బాంబ్‌ డిటెక్షన్‌ స్క్వాడ్‌కు సిబ్బంది సమాచారం అందించారు.