ముంబయిలో 26/11 ఉగ్రదాడి జరిగి 15 ఏళ్లు గడిచాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దాడులకు కారణమైన లష్కరే తోయిబాను ఉగ్రసంస్థగా గుర్తించి నిషేధించింది. ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ రకమైన అభ్యర్థనను భారత్ కోరనప్పటికీ తాము స్వతహాగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.