కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఉన్న ప్రఖ్యాత హసనాంబ ఆలయం వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. విద్యుత్ తీగ తెగిపడటంతో కొంతమంది భక్తులు కరెంట్ షాక్ కు గురయ్యారు. దీంతో అక్కడే ఉన్న ఇతర భక్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి.