త్వరలో ఢిల్లీకి ఎయిర్‌ట్యాక్సీ.. 30 కి.మీ దూరానికి ఏడే నిమిషాలు
భారత్‌లో ఎయిర్ ట్యాక్సీ సేవలు ప్రారంభించనున్నట్లు ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ప్రకటించింది. ఇండిగో మాతృసంస్థ ఇంటర్ గ్లోబ్ ఎంటర్ ప్రైజెస్, అమెరికాకు చెందిన ఆర్చర్ ఏవియేషన్ సంయుక్తంగా వీటిని రూపొందించనున్నట్లు చెప్పింది.