శివునికి అభిషేకం చేస్తూనే శివైక్యం...!

వాన రాకడ.. ప్రాణం పోకడ ఎవరికీ తెలియదంటారు. మనిషి జన్మించినప్పుడే మృత్యువు కూడా వెంటే వస్తుందని పెద్దలు చెబుతారు. అది ప్రతిక్షణం నీడలా వెన్నంటే ఉంటుందని, సమయం రాగానే క్షణాల్లో ప్రాణాన్ని తనతో తీసుకెళ్లిపోతుందని పెద్దలు చెప్పగా వింటుంటాం. అది అక్షర సత్యమని అనిపిస్తుంది ఈ ఘటన చూస్తే.