ఎంకి పెళ్లి సుబ్బి సావుకొచ్చినట్లుగా ఉంది ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి. ఆర్టీసి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉద్యోగులకు శాపంగా మారింది. బస్సులో ఖాళీ లేదు అన్నందుకు ఓ మహిళా కండక్టర్ ను నానా తిట్లూ తిట్టారు మహిళా ప్రయాణికులు. ఈ బస్సు మాది.. నీతో మాకు పనిలేదంటూ గొడవకు దిగారు. వారితో వాదించలేక బస్సునుండి దిగిపోయి కన్నీరుమున్నీరుగా విలపించారు ఆ మహిళా కండక్టర్.