ప్రముఖ బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వాళ్లు చాలా మందే ఉన్నారు. సాధారణంగా ఈ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసిన వాళ్లందరూ సినిమాల్లో బిజీ అయిపోవడమో లేదా టీవీ షోల్లోనో సందడి చేస్తుంటారు. అలాగే సోషల్ మీడియాలోనూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తుంటారు. అయితే ఒకతను మాత్రం వీటన్నిటికీ దూరంగా ఉన్నాడు.