గుజరాత్ లో 4.7 కోట్ల ఏళ్ల నాటి పాము! ఇది పురాణాల్లో చెప్పిన వాసుకీనా Vasuki Snake-tv9

వాసుకి పేరు చెప్పగానే క్షీరసాగర మథనం గుర్తుకు వస్తుంది. అమృతం కోసం పాల సముద్రాన్ని చిలకడానికి దేవతలు, రాక్షసులు సిద్ధమయ్యారు. కవ్వంగా మంధగిరిని, తాడుగా వాసుకిని ఉపయోగించారు. వాసుకి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఈ చిత్రం కళ్లముందు కదులుతుంది. ఇంతకీ పురాణాల్లో చెప్పుకునే ఆ పాము భూమిపై సంచరించిందా? మరి.. గుజరాత్ లో శాస్త్రవేత్తలకు లభించిన ఆ పాము శిలాజాలకు, దానికి సంబంధమేంటి?