నేరస్థులకూ హక్కులు ఉంటాయని.. వాటిని అతిక్రమిస్తే పోలీసులైనా సరే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని నిరూపించే సంఘటన అమెరికాలోని న్యూయార్క్ లో జరిగింది. 2018లో జరిగిన ఈ ఘటనపై పోలీసులు తాజాగా రాజీకి వచ్చారు. బాధితులకు పరిహారం చెల్లించి కోర్టు బయట సెటిల్ చేసుకునేందుకు అంగీకరించారు. ఇందుకు గానూ భారీ మొత్తం.. 17.5 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు అంగీకరించారు.