డిస్పోజబుల్‌ కప్స్‌, కవర్స్‌.. డేంజర్‌ బెల్స్‌ వీడియో

నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ప్లాస్టిక్‌ లేకుండా మానవులకు ఏ పనికావడం లేదు. టీ, కాఫీ, టిఫిన్, భోజనం ఇలా అన్నింటిని నిషేధిత ప్లాస్టిక్‌ కవర్లలో తెచ్చుకొని ఆరగిస్తున్నాం. సిటీలో ప్రతి గల్లీకో కర్రీ పాయింట్‌ ఉంటుంది. అడుగడుగున ఓ టీ స్టాట్‌ ఉంటుంది. వాటిలో ప్లాస్టిక్‌ విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. వేడి వేడి కూరలు, సాంబార్, హాట్ హాట్ టీ, కాఫీలు ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసి ఇస్తుంటారు. ఇలా వేడి వేడి పదార్థాల ప్లాస్టిక్‌లో ప్యాక్‌ చేయడం ఆరోగ్యానికి ప్రమాకరంగా మారుతోంది. డిస్పోజబుల్ కప్పుల్లో టీ, కాఫీ తాగడం డేంజర్‌ అని హెచ్చరిస్తున్నారు వైద్యులు.