ఢిల్లీలో సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు అఫ్తాబ్ పూనావాలాను రోజులో కొన్ని గంటలు ఓపెన్ జైలులో ఉంచాలని తీహార్ జైలుకు ఢిల్లీ హైకోర్టు సూచించింది. ఇతర ఖైదీలకు వర్తించే నిబంధనల మాదిరిగా రోజుకు ఎనిమిది గంటలపాటు ఏకాంత జైలు గది నుంచి బయటకు వచ్చేందుకు అనుమతించాలని పేర్కొంది. ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.