పరమేశ్వరుడిని వివిధ పేర్లతో కొలిచే ఆలయాలు దేశవ్యాప్తంగా ఎన్నో ఉంటే... ఆ ఊరిలో మాత్రం స్వామిని దొంగ మల్లన్నగా పిలుస్తారు. సుమారు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని దొంగలు నిర్మించడం వల్లే స్వామికి ఆ పేరు వచ్చిందని చెబుతారు.