ప్రైవేటు ట్రావెల్‌ బస్సులో కోట్ల విలువైన బంగారం చోరీ

ఏకంగా 3 కోట్ల విలువైన బంగారు నగలతో ప్రైవేటు ట్రావెల్‌ బస్సులో బయలుదేరాడు ఓ వ్యాపారి. బస్సు భోజనం కోసం ఓ దాబా దగ్గర ఆగింది. అందరూ దిగారు.. ఈ వ్యాపారి కూడా సిగరెట్‌ తాగుదామని కిందకు దిగాడు. తిరిగి బస్సు ఎక్కి చూసే సరికి ఆభరణాలు ఉన్న బ్యాగ్‌ మిస్‌. లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. సినీ ఫక్కిలో జరిగిన చోరీ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం సత్వార్‌ వద్ద శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.