ఏటీఎం కొట్టేద్దామనుకున్నారు... నోట్లన్నీ కాలిపోయాయి

బెంగళూరులోని ఏటీఎంను లూటీ చేసేందుకు దొంగలు ప్రయత్నించారు. గ్యాస్‌ కట్టర్‌తో దానిని తెరిచారు. అయితే ఏటీఎంలో భారీగా ఉన్న నగదు ఆ మంటలకు కాలిపోయింది. సీసీటీవీ ఫుటేజ్‌ ద్వారా ఈ విషయం తెలుసుకున్న బ్యాంకు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.