Ottలోకి వస్తున్న 100 కోట్లసూపర్ హిట్ మూవీ..

చాలా రోజుల తర్వాత మహారాజ సినిమాతో సోలో హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు విజయ్ సేతుపతి. ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఇప్పటికే వంద కోట్ల వసూళ్లు దాటేసింది. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులోనూ విజయ్ సేతుపతి సినిమాకు భారీ కలెక్షన్లు వస్తున్నాయి. మహారాజ పేరుతోనే డబ్ అయిన ఈ సినిమకు ఇప్పటివరకు తెలుగు నాట సుమారు 20 కోట్లు వచ్చాయని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.