Us Tornado అమెరికాలో సుడిగాలి బీభత్సం - Tv9

అమెరికాలో సుడిగాలులు విధ్వంసం సృష్టించాయి. టెన్నసీ రాష్ట్రంలో శనివారం ఒక్కసారిగా సుడిగాలి బీభత్సం సృష్టించింది. సుడిగాలి ధాటికి ఆరుగురు మృత్యువాతపడ్డారు. మరో 23 మంది గాయపడ్డారు. వీరిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. సుడిగాలుల విధ్వంసానికి టెన్నసీ నగరంలో అనేక ఇళ్లు ధ్వంసం అయ్యాయి. రాత్రంతా నగరం మొత్తం విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో సుడిగాలులు నగరాన్ని తాకాయి. టెన్నసీని మరిన్ని సుడిగాలులు తాకే అవకాశం ఉందని జాతీయ వాతావరణ సర్వీసు హెచ్చరికలు జారీచేసింది.