సీతాఫలం అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన అద్భుతమైన పండు. ఇది సీజనల్ ఫలం. చలికాలంలో ఎక్కువగా ఇవి లభిస్తాయి. చాలా మంది ఇష్టపడే పండ్లలో సీతాఫలం ఒకటి. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ సీతాఫలం తినొచ్చు. దీని గుజ్జు తినడానికి రుచిగా ఉండటమే కాదు ఆరోగ్యానికి ఎంతో మంచిది. సీతాఫలం కొలెస్ట్రాల్, క్యాన్సర్ సమస్యలకు దివ్యౌషధం. ఇందులో విటమిన్ సి, ఐరన్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వలన రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇందులో విటమిన్ బి6 పుష్కలంగా ఉంటుంది. ఇది ఒత్తిడిని తగ్గించడానికి, మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయోజనకరంగా ఉంటుంది.