డ్రైవింగ్‌ లైసెన్స్‌ పై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. Lmv లైసెన్స్‌ ఉందా అయితే మీరు..

దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు ఎల్ఎంవీ డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్లు ట్రాన్స్‌పోర్టు వాహనాలను నడపడమే దీనికి కారణమంటూ ఇటీవల వస్తున్న ఆరోపణలను కోర్టు ప్రస్తావించింది. ఈ రెండింటికీ సంబంధం లేదని తెలిపింది. మోటారు వాహనాల చట్టం 1988లో పేర్కొన్న అదనపు అర్హత ప్రమాణాలు దాని కింద రూపొందించిన నియమాల ప్రకారం మధ్యస్త, భారీ రవాణా వాహనాలు 7,500 కేజీల కంటే ఎక్కువ స్థూల బరువు కలిగిన ప్రయాణికుల వాహనాలకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది.