పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు - లాఠీలకు పనిచెప్పిన పోలీసులు Clashes in Telangana Polling Stations : తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పండుగ వాతావరణం నెలకొంది. ప్రజలు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రముఖులు సైతం సామాన్యులతో కలిసి క్యూలైన్లలో నిలబడి ఓటు వేశారు. ప్రతి పౌరుడు ఎన్నికల పండుగలో పాల్గొని తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని పిలుపునిస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలుచోట్ల చెదురుమదురు ఘటనలు జరిగాయి. అధికార బీఆర్ఎస్, విపక్ష నేతలు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతున్నారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా చర్యలు తీసుకుంటున్నారు.