నడి సముద్రంలో తప్పిపోయిన మత్స్యకారుడు 95 రోజుల తర్వాత.. వీడియో

చేపల వేటకని బయలుదేరాడు. తుఫాను దారిని మళ్లించింది. ప్రపంచంలోనే అతి పెద్దదైన పసిఫిక్‌ మహాసముద్రంలో కొట్టుకుపోయాడు. ఎటు చూసినా నీళ్లు.. నెల..రెండు నెలలు..మూడు నెలలు.. సముద్రంలోనే జీవితం. సరైన ఆహారం లేదు. మంచి నీరు కూడా లేదు. అయినా బతకాలన్న ఆశ అతడిని ఒడ్డున చేర్చింది. 95 రోజుల తరువాత గస్తీ బృందానికి దొరికాడు. సినిమా స్టోరీని తలపిస్తున్న ఈ కథ..పెరూవియన్‌ తీరంలో జరిగింది.