అయోధ్యలో రామాలయం కోసం ఎంతమంది ఎన్నో త్యాగాలు చేశారు. కష్టాలు అనుభవించారు. భారీ శపధాలు చేశారు. అలాంటి వారికి సంబంధించిన ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. మధ్యప్రదేశ్ కు చెందిన రవీంద్ర గుప్తా ఉదంతం ఈ కోవకే వస్తుంది. బైతూల్కు చెందిన రవీంద్ర గుప్తా అలియాస్ భోజ్పలి బాబా అనే సాధువును అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానించింది ఆలయ ట్రస్ట్. 56 ఏళ్ల రవీంద్ర గుప్తా రాముడికి పరమ భక్తుడు. అయోధ్యలో రామాలయం నిర్మించేవరకు వివాహం చేసుకోనని 1992 డిసెంబర్ 6న శపథం చేసి, అలా ఒంటరిగానే ఉండిపోయారు.