రిస్క్ లేకుండా గ్యారెంటీ రిటర్న్స్!

మనం కష్టపడి సంపాదించిన సొమ్మును పొదుపు చేయడం చాలా ముఖ్యం. పొదుపు చేయడంతో పాటు.. దానిని ఇన్వెస్ట్‌ చేస్తే ఇంకా ఎక్కువ రిటర్న్స్ అందుకోవచ్చు. రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండొచ్చు. వృద్ధాప్యంలో కూడా ఇబ్బందులు లేకుండా ఉండొచ్చు. ఇలా ఎన్నో పథకాలు ఉన్నాయి. వీటిల్లో గ్యారెంటీ రిటర్న్స్ అందించే.. పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్స్ కూడా ఉన్నాయి. ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్ లేకుండానే స్థిరమైన ఆదాయం అందించే పథకమే పోస్టాఫీస్ మంత్‌లీ ఇన్‌కం స్కీమ్.