గుడ్‌న్యూస్‌..తగ్గిన బంగారం ధర..ఎంతో తెలుసా

పండగలు, వివాహాది శుభకార్యాల నేపథ్యంలో ఇటీవల వరుసగా దూసుకెళ్లిన బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. మంగళవారం దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.1300 మేర తగ్గి రూ.81,100కు చేరినట్లు ఆలిండియా సరాఫా అసోసియేషన్‌ తెలిపింది. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పసిడి ధర గురువారం గరిష్ఠంగా రూ.82,400 మేర పలికిన సంగతి తెలిసిందే.