భారతదేశంలో దేవతా విగ్రహాలు ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంటాయి. కొన్ని విగ్రహాలు దేవతా స్వయంభువులుగా వెలసినవి అయితే, కొన్ని మాత్రం శిల్పులు తమ కళానైపుణ్యంతో తీర్చిదిద్దినవి. ఇలాంటివెన్నింటినో ఆలయాల్లో ప్రతిష్ఠించి.. పూజలు చేస్తున్నారు. ఇక.. కొందరు రాయిపై శిల్పాలు చెక్కితే.. మరికొందరు పంచలోహాలతో దేవతా విగ్రహాలను తయారుచేస్తారు. అలాంటివాటిలో అత్యంత అరుదైన... ప్రపంచంలో మరెక్కడా కనిపించని దేవతామూర్తి విగ్రహం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో పూజలందుకుంటోంది. ఇంతకీ ఆ దేవతా మూర్తి ఎవరు.. ఆ కథేమిటో తెలుసుకుందాం.పశ్చిమగోదావరి జిల్లాలోని పెనుగొండ.. వైశ్యులు తమ కులదేవతగా ఆరాధించే కన్యకాపరమేశ్వరిదేవి జన్మస్థలం.