మొత్తానికి పబ్లిక్‌గా అసలు విషయం చెప్పాడు..

జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత ఒకరు. జోడీగా బోలెడు కామెడీ స్కిట్లు చేసి ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించారీ ట్యాలెంటెడ్ యాక్టర్స్. రీల్ లైఫ్‌లో జంటగా నటించిన వీరిద్దరూ నిజ జీవితంలోనూ జోడీగా మారారు. జబర్దస్త్ వేదికపైనే తమ ప్రేమ విషయాన్ని బయట పెట్టారు. ఆ తర్వాత పెద్దల అనుమతితో పెళ్లిపీటలెక్కారు. గతేడాది ఫిబ్రవరి 24న తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి సాక్షిగా ఏడడుగులు వేశారు రాకేష్, సుజాత.