పామాయిల్ తోటలో వింత శబ్దాలు.. దగ్గరకు వెళ్లి చూడగా గుండె గుభేల్‌

ఎండాకాలం మొదలైన దగ్గరి నుంచి వనాల్లో ఉండాల్సిన పాములు వేసవి తాపాన్ని తట్టుకోలేక జనావాసాల్లోకి చేరుతున్నాయి. అనకాపల్లి జిల్లాలో ఓ కింగ్‌ కోబ్రా హల్‌ చల్‌ చేసింది. జిల్లాలోని మాడుగుల సాగరం రహదారి పక్కన ఓ పామాయిల్‌ తోట ఉంది. అందులో పనిచేస్తున్న కూలీలను పరుగులు పెట్టించింది ఓ భారీ కింగ్‌ కోబ్రా. రోడ్డుదాటి మెరుపు వేగంతో పామాయిల్‌ తోటలోకి దూసుకొచ్చిన కింగ్‌ కోబ్రాను చూసి షాకయ్యారు కూలీలు. భయంతో తలో దిక్కూ పరుగులు తీశారు.