జగన్ - షర్మిల ఆస్తులపై స్పష్టత ఇచ్చిన వైఎస్ విజయమ్మ

జగన్, షర్మిల మధ్య ఆస్తుల వివాదంపై వైఎస్ అభిమానులకు విజయమ్మ కీలక లేఖ రాశారు. తన కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో అర్థం కావడంలేదని.. జరుగుతున్న సంఘటనలు బాధ కలిగిస్తున్నాయన్నారు. తానెంత ప్రయత్నించినా జరగకూడనివి తన కళ్ల ముందే జరిగిపోతున్నాయని.. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్లు మాట్లాడుతున్నారని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.