అద్దెదారులు, ఇంటి యాజమానుల మధ్య తరుచూ వాగ్వాదాలు, తగువులాడుకోడం సర్వసాధారణం.. ఏదైనా విషయంలో భిన్నాభిప్రాయాలు ఉంటే ఘర్షణ వాతావరణం తప్పదు. అలాంటి ఘటననే ఒకటి ఇంగ్లండ్‌లో వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించినే వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఒక ఇంటి యజమాని తన కిరాయిదారుపై చాలా కోపంగా ఊగిపోయాడు. అతను తన కోపాన్ని వెళ్లగక్కడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతిని ఎంచుకున్నాడు. ఇది చూసిన తరువాత, ప్రపంచంలోని అద్దెదారులందరూ భయపడుతున్నారు.