Viral ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. ఏకంగా పులితోనే..! - Tv9

సోషల్‌ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్‌ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని ఆశ్చర్యం కలిగిస్తే, కొన్ని అవాక్కయ్యేలా చేస్తాయి. ఇందులో వన్యమృగాలకు చెందినవి ఎక్కువగా ఉంటాయి. ఇటీవల ఓ యువకుడు పెద్దపులిని వెంటబెట్టుకొని నడిరోడ్డుపైన వాకింగ్‌ చేసిన వీడియో నెట్టింట బాగా వైరల్‌ అయింది. తాజాగా అలాంటిదే మరో వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఇక్కడ ఓ చిన్న బాలుడు పులిని వెంటబెట్టుకొని షికారుచేశాడు.