ఏపీలో తుపాన్ బీభత్సం.. సంతకు వెళ్లి వస్తూ వాగులో కొట్టుకుపోయారు
తుఫాన్ తీరం దాటినా ఇంకా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో వాగులు, గెడ్డలు పొంగిపొర్లుతున్నాయి. వరద ఉదృతి పెరిగింది. ప్రమాదకరంగా ప్రవహించే గెడ్డలు దాటే క్రమంలో.. గిరిజనులు గల్లంతవుతున్నారు.