బీఎస్‌ఎన్‌ఎల్ తన చౌక రీఛార్జ్ ప్లాన్‌లతో ప్రైవేట్ టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాలకు టెన్షన్ పుట్టిస్తోంది. కంపెనీ తన 4G నెట్‌వర్క్‌ను విస్తరిస్తోంది. త్వరలో 5G సేవలను కూడా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. బీఎస్‌ఎన్‌ఎల్ ఇలాంటి మరిన్ని రీఛార్జ్ ప్లాన్‌లను అందుబాటులోకి తేనుంది. ఇందులో వినియోగదారులకు ఎక్కువ రోజుల పాటు వ్యాలిడిటీని అందిస్తోంది. ప్రైవేట్ కంపెనీలు 28 రోజుల ప్లాన్‌ను అందిస్తే, బీఎస్‌ఎన్‌ఎల్ 150 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది.