అసోంలోని నాగావ్ జిల్లాలో కలియాబోర్ ప్రాంతంలోని ఓ ఇంటి బాత్రూం నుంచి పాము పిల్లలు బయటికి వస్తుండడాన్ని గమనించిన ఆ ఇంటి వారు హడలిపోయారు. ఒకటి బయటకు వెళ్లిపోయిన తర్వాత డోర్ ఓపెన్ చేసి చూడగా దెబ్బకు షాకయ్యారు ఆ ఇంటి యజమానులు. బాత్రూమ్‌లో ఏకంగా ఓ 30 వరకూ పాములు కనిపించాయి. భయంతో కేకలు వేయడంతో ఇరుగుపొరుగువారు వచ్చి చూసి ఆశ్చర్యపోయారు.