విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలనుకునే విద్యార్ధుల మొదటి ఎంపిక అమెరికా. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఇందులో భారతీయులు ముందుంటారు. ఒక్క భారత్‌నుంచే కాదు చాలా దేశాల నుంచి ఏటా ఎంతోమంది విద్యార్థులు అగ్రరాజ్యానికి వెళ్తుంటారు. అయితే, గత కొంతకాలంగా ఈ విద్యార్థి వీసాల సంఖ్యకు అమెరికా సర్కారు భారీగా కోత విధిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 41శాతం వీసా దరఖాస్తులను తిరస్కరించింది.