అరుణాచల్ ప్రదేశ్‌లో కురిసిన భారీ వర్షాలకు కొండ చరియలు విరిగి పడ్డాయి. దీంతో చైనా సరిహద్దులకు వెళ్లే రహదారి మూసుకుపోయింది. ఈ ఘటనతో చైనా బోర్డర్‌ను కలిపే జాతీయ రహదారి NH 313 చాలా వరకు ధ్వంసమైంది. ఈ ప్రాంతంలో కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురవడంతో కొండచరియలు విరిగిపడినట్లు అధికారులు తెలిపారు. జాతీయ రహదారి ధ్వంసం కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి.