చైనా ప్రయోగం సక్సెస్ .. జాబిల్లి అవతలివైపు ల్యాండ్ అయిన చాంగే-6..! - Tv9

చైనాకు చెందిన లూనార్‌ల్యాండర్‌ చాంగే-6 విజయవంతంగా జాబిల్లి అవతలివైపు ల్యాండ్‌ అయింది. ఈ విషయాన్ని చైనా నేషనల్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రకటించింది. బీజింగ్‌ కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 2,500 కిలోమీటర్ల విస్తీర్ణంలోని అయిట్కిన్‌ బేసిన్‌ పేరిట ఉన్న ప్రదేశంలో సురక్షితంగా ఉపరితలాన్ని తాకినట్లు పేర్కొంది. ఆ దేశ అంతరిక్ష ప్రయోగాల్లో ఇదొక కీలక ముందడుగు.