ఫొటోలు, వీడియోల కోసం కొందరు వెర్రిగా ప్రవర్తిస్తుంటారు. అత్యంత ప్రమాదకరమని తెలిసినా ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటారు. 380 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడుతున్న భారీ జలపాతం అంచున పడుకొని ఓ మహిళా టూరిస్ట్ జలకాలాడిన పాత వీడియో ఒకటి నెట్టింట మళ్లీ చక్కర్లు కొడుతోంది. వీడియోలో ఓ యువతి జాంబియా–జింబాబ్వే దేశాల మధ్య ప్రవహించే ప్రఖ్యాత విక్టోరియా ఫాల్స్ అంచున పడుకొని కిందకు చూడటం కనిపించింది.