దక్షిణాఫ్రికాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న బస్సు వంతెనపై నుంచి అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 45 మంది మృతిచెందారు. 8 ఏళ్ల బాలిక ప్రాణాలతో బయటపడింది. ఈస్టర్ పండుగ కోసం చర్చికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. 165 అడుగుల లోతులో బస్సు పడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. వెంటనే సహాయ చర్యలు చేపట్టినట్లు స్థానిక రవాణా శాఖ పేర్కొంది.