సాధారణంగా దొంగతనం చేస్తే ఎలాంటి అధారాలు వదలకుండా వెళ్తారు దొంగలు. అందుకోసం ఎన్నో అడ్డదారులు తొక్కుతుంటారు. కానీ నాగర్ కర్నూల్ జిల్లాలో చోరి చేయడమే కాకుండా తాము ఎందుకు చేశామో కారణం సైతం రాసి వెళ్లారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజిలోని ప్రాక్టికల్స్ సామాగ్రికి సంబంధించిన గదిలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కాపర్ వైర్లను చోరీ చేశారు. వివిధ గదుల్లో ఉండే సీలింగ్ ఫ్యాన్లను తీసేసి, అందులోని కాపర్ వైర్లను దొంగిలించారు. అనంతరం ఈ ఫ్యాన్లను తగులబెట్టారు. అయితే దొంగతనం చేయడం వరకు సరే.. తాము దొంగతనం ఎందుకు చేశామో అని క్లాస్ రూమ్ లో ఉన్న బ్లాక్ బోర్డ్ పై రాసి వెళ్లారు ఈ చోరకళాకారులు.