Tsrtc Bus Conductor Issues Ticket To Woman In Nizamabad

హైదరాబాద్‌, డిసెంబర్‌ 10: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ శనివారం (డిసెంబర్‌ 9) మహాలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు సోనియా గాంధి పుట్టిన రోజు సందర్భంగా ఈ పథకాన్ని ఏర్పాటు చేశారు. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు అందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సు లన్నింటిలో మహిళలు టికెట్‌ లేకుండా ఉచితంగా ఎన్నిసార్లైనా ప్రయాణించొచ్చు. దీంతో ఈ పథకం శనివారం మధ్యాహ్నం నుంచి అమలులోకి వచ్చింది. అయితే ఈ బస్సు కండక్టర్ మాత్రం ఎవరు ఏ పథకం తీసుకొస్తే నాకేంటీ.. నేను మాత్రం మహిళలకు టికెట్లు ఇస్తానంటూ రుబాబు చేస్తున్నాడు. ఓ మహిళకు టికెట్‌ కూడా ఇచ్చాడు. దీంతో ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. అసలేం జరిగిందంటే..