భారత్ జోడో యాత్ర ఫలితంతో ఫుల్ జోష్ మీదున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో యాత్రకు సిద్ధమవుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాహుల్ గాంధీ భారత్ న్యాయయాత్ర చేపట్టబోతున్నారు. మణిపూర్‌లో జనవరి 14న ప్రారంభమయ్యే యాత్ర మార్చి 20వ తేదీన ముంబైలో ముగుస్తుంది. మొత్తం 6వేల 200 కిలోమీటర్లు ఈ యాత్ర ఉంటుంది. 14 రాష్ట్రాల మీదుగా 84 జిల్లాల్లో సాగునుంది. యువతతో పాటు అన్ని వర్గాలను ఈ యాత్రలో రాహుల్ గాంధీ కలుస్తారు..