ఉపాధి కోసం యెమెన్ వెళ్లి అక్కడ ఓ హత్య కేసులో నిందితురాలిగా తేలడంతో కేరళ నర్సు నిమిష ప్రియకు మరణశిక్ష దాదాపు ఖరారయ్యింది. నిమిష ప్రియ తన కుటుంబంతో కలిసి యెమెన్ దేశం వెళ్లి అక్కడ నర్సుగా స్థిరపడింది. 2014లో ఆమె భర్త, కుమార్తె భారత్ కు తిరిగి వచ్చేశారు. ఆమె మాత్రం యెమెన్ లోనే ఉండిపోయింది. 2015లో ఆమె యెమెన్ లోనే సొంతంగా ఓ క్లినిక్ ప్రారంభించింది. ఆమెకు స్థానికుడైన తలాల్ అబ్డో మహ్దీ సాయపడ్డాడు.