Viral బాబోయ్ ... డిఈవో ఆఫీసులో దెయ్యం.. - Tv9

ఇటీవల దెయ్యాలు బాగా పాపులర్‌ అయిపోతున్నాయి. ఆ మధ్య హైదరాబాద్‌ నగరంలోనే ఓ ఇంట్లో దెయ్యాలు తిరుగుతున్నాయంటూ యూట్యూబర్స్‌ తమ ఛానెళ్లలో హోరెత్తించారు. ఈ ఘటన మరువకముందే ఇప్పడు ఆదిలాబాద్‌ జిల్లాలోని డీఈవో ఆఫీసులో దెయ్యం సంచరిస్తోందనే వార్త సంచలనం రేపింది. అర్ధరాత్రి దాటిన తర్వాత డీఈవో ఆఫీసురూమ్‌నుంచి వింత శబ్ధాలు వినిపిస్తున్నాయట.