ఆ విషయంలో గుంటూరోడికే ప్లస్సు.. ఇది చాలు కదా... బొమ్మ హిట్టవడానికి! Guntur Kaaram Mahesh Babu-tv9

బయట సంక్రాంతి సంబరం మొదలైంది. పండగకొచ్చే సినిమాల సందడి కూడా షూరూ అయింది. పోస్టర్లు.. పాటలు.. ప్రమోషన్లు.. ఇంటర్వ్యూల జోరు ఒక్కసారిగా పెరిపోయింది. అయితే ఈ జోరులోనూ... గుంటూరోడికి ఈ సాలిడ్‌ ప్లస్‌ పాయింట్ ఉందంటూ... కొంత మంది నెటిజన్లు నెట్టింట గుర్తు చేస్తున్నారు. ఇది చాలు కదా... రవణగాడి సినిమా హిట్టవడానికి.. అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక ఎప్పటిలాగే ఈ సంక్రాంతికి... మహేష్‌, వెంకటేష్‌, నాగార్జునతో పాటు.. తేజా సజ్జా కూడా బరిలో దిగుతున్నాడు. అయితే మహేష్‌ గుంటూరు కారం సినిమాలో తప్పితే... వెంకటేష్‌ సైంధవ్ సినిమాలోనూ.. నాగార్జున నా సామి రంగ సినిమాలోనూ... తేజ సజ్జా హనుమాన్ సినిమాలోనూ... ఓ మాంచి మాస్‌ సాంగ్‌ మిస్సైందని గుర్తు చేస్తున్నారు.