దేవుడికి నైవేద్యంగా వైన్‌.. వీడియో వైరల్

మనం భగవంతుడికి పూజ చేసి తోచింది నైవేద్యంగా సమర్పిస్తాం. పాలు, అరటిపళ్లు, కొబ్బరికాయలు, స్వీట్స్‌ ఇలా ఏదొకటి సమర్పిస్తాం. కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక వైన్ షాప్ నిర్వాహకులు తమ వ్యాపారం బాగా సాగాలని దేవుడిని కోరుతూ మద్యం దేవుడికి నైవేద్యంగా సమర్పించారు. ఇలా మద్యం బాటిళ్లు దేవుడిదగ్గర ఉంచి రోజూ పూజలు చేస్తున్నారు. మద్యం కొనుక్కోడానికి దుకాణానికి వెళ్లినవాళ్లు అది చూసి ఇదెక్కడి విడ్డూరం అంటూ ఆశ్చర్యపోతున్నారు. పనిలో పనిగా ఈ ప్రసాదాన్ని మాలాంటి భక్తులకు పంచితే బావుండునని అంటున్నారు.