అధికారుల వివరాలు ప్రకారం.. మలేసియాలో ఏప్రిల్ 26న రాయల్ మలేసియన్ నేవీ దినోత్సవం జరగనుంది. ఇందుకోసం పెరక్‌లోని లుమత్ ప్రాంతంలో మంగళవారం రిహార్సల్స్ నిర్వహించారు. ఈ క్రమంలో ఉదయం శిక్షణ విన్యాసాల నిమిత్తం పడంగ్ సితియావాన్ నుంచి గాల్లోకి ఎగిరిన రెండు హెలికాప్టర్లు కొద్ది క్షణాలకే ఒకదానినొకటి ఢీకొని కుప్పకూలాయి. వీటిల్లో ఒకటి విన్యాసాలు జరుగుతున్న ప్రాంతానికి పక్కనే ఉన్న స్థానిక స్టేడియంలో కూలిపోయింది.