టాలీవుడ్ లో సత్తా చాటుతోన్న అతికొద్ది మంది తెలుగు హీరోయిన్లలో అనన్య నాగళ్ల ఒకరు.ఇటీవల అనన్య నటించిన చిత్రం పొట్టేల్ సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో అనన్య పోషించిన బుజ్జమ్మ పాత్ర విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక వకీల్ సాబ్ తర్వాత మరో మెగా ఆఫర్ దక్కించుకుందీ ముద్దుగుమ్మ. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తోన్న చిత్రంలో అనన్య నటిస్తుంది. ఇటీవలే ఈ అమ్మడుకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు మేకర్స్.